రైతులకు పెన్షన్‌ వర్తింప చేయాలి

ఏలూరు,నవంబర్‌22(జ‌నంసాక్షి): రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కౌలురైతు సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఇకపోతే గిట్టుబాటు ధరలన్నవి ఎప్పుడూ దక్కడం లేదన్నారు. కౌలు రైతులకు అయితే సమస్యలు తప్పడం లేదన్నారు. ఏ పంట వేసినా గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకాన్ని రైతులకు ఈ ప్రభుత్వాలు కల్పించలేకపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వరికి మద్ధతు ధరను ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు అదనంగా రూ.500 ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా 60 ఏళ్లు నిండిన రైతుకు నెలకు రూ. 10వేలు పింఛను అందించాలన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తప్పు పట్టారు.