రైతులకు మద్దతు ధర కల్పించాలి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 25 : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించి జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు శ్రీహరిరావు డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తనాలు, ఎరవుల ధరలు పెంచినప్పటికీ గిట్టుబాటు ధర కల్పించకపోవడం శోచనీయమని అన్నారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిన దృష్ట్యా పత్తి క్వింటాల్‌ రూ.6 వేలు, వరి క్వింటాల్‌ రూ. 2 వేలు, స్వయబీన్‌ క్వింటాల్‌కు రూ.4 వేలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గత ఏడాది రైతులకు అందిచాల్సిన పంట నష్టపరిహారాన్ని చాలా మంది రైతులకు అందలేదని ఆయన పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి  రైతులు దళారుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.