రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు: టీడీపీ అధినేత చంద్రబాబు

వైకాపాను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సోనియాకి షరతు విధించారు
కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజలు బతకలేని పరిస్థితి
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు
టీడీపీ అధినేత చంద్రబాబు
హైదరబాద్‌ నవంబర్‌ 14, (జనంసాక్షి) :

వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు,కడప పార్లమెంటు సభ్యుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియాకి షరతు విధించారని చంద్రబాబు నాయుడు గారు బుధవారం విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజలు బతకలేని పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రభుత్వాన్ని అంతమోందిచాలని పిలుపునిచ్చారు.. పిల్లలు కష్టపడి చదివి దేశభివృద్దికి పాటుపడాలన్నారు.