రైతుల్ని అవమానపరుస్తారా


` భేషరతుగా క్షమాపణ చెప్పండి
` కేంద్రానికి హరీశ్‌ డిమాండ్‌
` 70లక్షల మంది రైతులు, 4 కోట్ల మంది ప్రజల తరపున మంత్రులు ఢల్లీికి వచ్చారని వెల్లడి
హైదరాబాద్‌,డిసెంబరు 22(జనంసాక్షి): కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తక్షనం తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆయన ప్రజలు అవమానించారని మండిపడ్డారు. అలాగే ఢల్లీికి వచ్చిన మంత్రుల బృందాన్ని కూడా అవమానించారని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో చర్చించేందుకు ఢల్లీి వెళ్లిన మంత్రుల బృందాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలపై బుధవారం విూడియా సమావేశంలో మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి గోయల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకమన్నారు. కేంద్రమంత్రిగా కాకుండా రాజకీయ నాయకుడిలా మాట్లాడారని, రాష్ట్రంతో వ్యవహ రించే తీరుగా ప్రవర్తించలేదన్నారు. మంత్రులు 70లక్షల మంది రైతులు, నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున ఢల్లీికి వచ్చారని, వారిని కేంద్రమంత్రి విూకేం పనిలేదా? అంటూప్రశ్నించడం దారుణమని అన్నారు. ఈ వ్యాఖ్యలు యావత్‌ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడం, 70లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేన న్నారు. వెంటనే పీయూష్‌ గోయల్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించు కొని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 70లక్షల రైతు కుటుంబాలు ఆగమవు తున్నాయని, నిన్నగాక మొన్న బాయిల్డ్‌ రైస్‌ కొనమని చెప్పారని, రేపు రా రైస్‌ కూడా కొనమని చెతులెత్తేస్తే మా రైతులు ఏం కావాలని ప్రశ్నించారు. ఓ వైపు రైతుల కళ్లాల వద్ద పడిగాపులు పడుతు న్నారన్నారు. విూరిచ్చిన 40లక్షల మెట్రిక్‌ టన్నుల కోటా పూర్తయ్యింది, ఆ తర్వాత కొంటరా కొనరా? అని అడిగేందుకు రైతుల బృందం ఢల్లీికి వచ్చారన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి అభ్యర్థన చేసేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని అవమానపరచడం సరికాదన్నారు. రాజకీయం చేసింది కేంద్రమంత్రే నన్న ఆయన.. మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బృందం వస్తే కలిసేందుకు విూకు సమయం లేదా? అని హరీశ్‌రావు మండిపడ్డారు. మంత్రుల బృందాన్ని కలువకుండా.. స్థానిక బీజేపీ నేతలను ఢల్లీికి పిలిపించుకొని సమావేశమయ్యేందుకు సమయం దొరికిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున వచ్చిన బృందాన్ని మొదట కలుస్తారా.. లేదంటే రాజకీయ నేతలను, బీజేపీ నేతలు, కార్యకర్తలను కలిసి.. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. విూరే రాజకీయం చేసుకుంటూ.. మమ్మల్ని రాజకీయం అంటారా? అన్నారు. రాష్ట్రమంత్రులను విూకేం పని లేదా? అని మాట్లాడుతారా.. ఇదో గౌరవ మంత్రి మాట్లాడే భాషేనా అంటూ కేంద్రమంత్రిపై హరీశ్‌రావు మండిపడ్డారు. ఆరుగురు మంత్రులు వచ్చారంటే.. ఒక రాష్ట్రం తరఫున అత్యున్నత డెలిగేషన్‌ ఇంకా ఏమైనా ఉంటదా?.. ఎంత ప్రాధాన్యం ఉంటే వారు ఢల్లీికి వస్తారన్నారు. 70లక్షల మంది రైతుల ఆత్మగౌరవం, ప్రయోజనాలు కాపాడడమే తమ ప్రాధాన్యమని, కేవలం రాజకీయమే విూ ప్రాధాన్యమని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టుక తెలంగాణ జాతి, ప్రయోజనాల కోసమన్నారు. అనేక త్యాగాల పునాదుల విూద రాష్టాన్న్రి సాధించామని, రైతుల ప్రయోజనాల కంటే మాకేం ముఖ్యముంటుందని.. అందుకు ఢల్లీికి వచ్చారన్నారు. మాట తప్పింది, మాట మార్చింది.. రాజకీయం చేస్తూనే తమపై నిందలు వేస్తున్నారన్నారు.ఒక ఓటు రెండు రాష్టాల్రని మధ్యలోనే వదిలిపెట్టిన పార్టీ బీజేపీ అన్నారు. కాకినాడ తీర్మానం చేసి ఢల్లీిలోకి అధికారం చేపట్టగానే మోసం చేసింది విూరు కాదా? అన్నారు. కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేపట్టి.. చావు దగ్గర వరకు వెళ్లి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీదన్నారు. విూలాగా ఒక ఓటు రెండు రాష్టాల్రంటూ వెన్నుపోటు పొడిచిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది కాదన్నారు. విూరన్న 40లక్షల మెట్రిక్‌ టన్నులకు అలాట్‌మెంట్‌ ఇచ్చారని, ఇప్పటికే 50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నామన్నారు. ఇంకా 20 నుంచి 30లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్లో ఉన్నది, రైతుల చలిలో పడిగాపులు కాస్తున్నారన్నారు. ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయాన్ని రాతపూర్వ కంగా చెప్పాలని రాష్ట్రం తరఫున అధికారికంగా బృందం వస్తే స్పందించాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల ఓట్లు కావాలి కానీ.. రైతుల భాద పట్టించుకోరా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. కేంద్రమంత్రి గోయల్‌ మాట్లాడేవన్నీ అబద్దాలేనన్నారు. పంజాబ్‌లో వడ్లు కొన్నట్లే.. తెలంగా ణలో కొనమని ఆడిగామన్నారు. పంజాబ్‌లో కొని, ఇక్కడ ఎందుకు కొనరని ప్రశ్నించారు. యాసంగిలో వడ్లు కొంటారా కొనరా? అని నిలదీశారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రూ. 14 వేల 5 వందల కోట్లు రైతు బంధు ఇస్తున్నామన్నారు. పంటల సేకరణ కేంద్రం పరిధిలో ఉందన్నారు. కరువు వస్తే రాష్టాల్ర దగ్గర ఉన్న ధాన్యం బలవంతంగా తీసుకుంటున్నారని, ఎగుమతి, దిగుమతులు కేంద్రం పరిధిలో ఉందన్నారు. రాష్టాల్రపై బురద చల్లితే ఊరుకోమని హరీష్‌రావు అన్నారు