రైతుల అనుమతితోనే ల్యాండ్ పూలింగ్
– ల్యాండ్‌పూలింగ్ విధానంలో దేశానికే ఏపీ మోడల్‌గా నిలిచింది
– చట్టబద్దత లేదనే నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా?
– తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్
అమరావతి, సెప్టెంబర్1(జనం సాక్షి ) : రైతుల అనుమతితోనే ల్యాండ్ పూలింగ్ చేపట్టామని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ స్పష్టంచేశారు. శనివారం ఆయన అమరావతిలో విూడియాతో మాట్లాడారు. భూ సవిూకరణకు చట్టబద్ధత ఉందని, భూ సవిూకరణకు చట్టబద్ధత లేదనే విమర్శలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రైతుల అనుమతితోనే పూలింగ్ చేపట్టి… అభివృద్ధిలో వారిని కూడా భాగస్వాములను చేస్తున్నామన్ని ఎంపీ అన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో దేశానికే ఏపీ మోడల్‌గా నిలిచిందన్నారు. భూ సవిూకరణకు చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు రిటైర్ జడ్జి గోపాల్ గౌడ ఎందుకన్నారో అర్ధం కావడంలేదన్న రవీంద్ర కుమార్, లెఫ్ట్ పార్టీలు, జనసేన రాజకీయంలో గోపాల్ గౌడ తెలియకుండా భాగస్వాములు కావడం బాధాకరమైన విషయమని అన్నారు. రాజధానిపై లెఫ్ట్ పార్టీలు రాజకీయం చేస్తే బీజేపీకే లాభం అన్నారు. మరోవైపు సింగపూర్‌లో నా కుమారుడికి ఆస్పత్రి ఉందని విచిత్ర ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. నా కుమారుడు ఇంజనీర్ అని, తప్పుడు ఆరోపణలు చేస్తే వారిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.