రైతుల అభివృద్ధికి పనిచేసే ప్రభుత్వం -మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్

రైతుల అభివృద్ధికి పనిచేసే ప్రభుత్వమని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమల శేఖర్ గౌడ్ పేర్కొన్నారు మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ మాజీ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎలక్షన్ రెడ్డి తో కలిసి ఈరోజు మెదక్ జిల్లా మనోహర బాద్ మండలం లోని రంగాయి పల్లి ముప్పి రెడ్డి పల్లి లింగరెడ్డిపేట్ కూచారం గ్రామాలలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చిన సందర్భంగా మాట్లాడారు గౌరవ జెడ్పీ చైర్ పర్సన్ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని , ధాన్యం ఉత్పత్తి లో దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరామని అన్నారు రైతుల అభివృద్ధికి రైతుబంధు రైతు బీమా సౌకర్యాలను కల్పించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వం అని అన్నారు రైతుల పండించిన ధాన్యం అంతా కొనుగోలు చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి , ఎంపిపి పురం నవనీత రవి ఎంపిడివో యాదగిరి రెడ్డి తహశీల్దార్ బిక్షపతి , వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి , రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఐకెపి ఎపిఎం పెంట గౌడ్ ఎంపీటీసీ స్వర్ణలత వెంకటేష్ సర్పంచులు నాగ భూషణం ప్రభావతి పెంటయ్య , నర్సయ్య సుగుణమ్మ నరేందర్ రెడ్డి నాయకులు రామకృష్ణ శ్రీహరి పెంట గౌడ్ తదితరులు పాల్గొన్నారు