రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌: పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని జిల్లా కేంద్రంలోని కిసాన్‌చౌక్‌లో రైతులు ఆందోళన చేశారు. మద్దతు ధర పెట్టి పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాని డిమాండ్‌ చేశారు. ఆరు గంటలనుండి ఈ ఆందోళన కినసాగుతుంది. దీంతో కిసాన్‌చౌక్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.