రైతుల రుణమాఫీ ప్రకటనతో అంబరాన్నింటిన రైతుల సంబరాలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు
చెన్నూర్,ఆగస్టు 3, (జనంసాక్షి) : తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా రుణమాఫీ ప్రకటించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు పాలాభిషేకం చేసి టపాసులు పీల్చి, స్వీట్లు పంచి రైతులు అంబరాన్ని అంటే విధంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణాల్లోని గ్రామాల్లో ని బిఆర్ఎస్ నాయకులు రైతులు మాట్లాడుతూ రైతులకు 19 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించడం ఇచ్చిన మాటకు కట్టుబడి కేసీఆర్ ఉన్నాడని హర్షం వ్యక్తం చేస్తూ హర్షద్వానులతో కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రైతులకు రైతుబంధు రైతు బీమా ఉచిత విద్యుత్తు సాగునీరు రుణమాఫీ పథకాల ద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధికి పాటుపడుతున్న కేసిఆర్ రైతు బాంధవుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాలు పట్టణాల్లోని బిఆర్ఎస్ నాయకులు ఎంపీపీ, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు రైతుబంధు మండలాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచ్ ,ఉప సర్పంచ్లు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.