రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)

మండల కేంద్రంలో తెలంగాణ  రైతుసంఘం ఆధ్వర్యాన.S.B.I. బ్యాంకు ముందు ధర్నా మేనేజర్ కు మెమోరాండం ఇస్తున్న రైతు సంఘం నాయకులు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కందుల సుందర్మలేశ్వర్ రెడ్డి వటైపు సైదులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు. కౌలు రైతులు. పంట రుణాల సాధనకు రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని వారు రైతులకు తెలియజేసినారు. జులై నెల లో మెట్ట పంటకు. ఆగస్టు నెలలో వరి నాట్లకు. వేయవలసిన తరుణంలో బ్యాంకర్లు రుణాలు ఇవ్వకుండా రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నారని వారు ప్రభుత్వాన్ని విమర్శించినారు. రాష్ట్రస్థాయిలో బ్యాంకర్లు కమిటీ పంట రుణాలకు వానాకాలం రు.51.230 కోట్లు ప్రకటించారు అవి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారన్నారు. జూన్ నుండి ఆగస్టు వరకుఈ మూడు నెలలో రైతుల నుండి వసూలు కానీ జప్తీయులు చేయవద్దు రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ బ్యాంకర్లు అమలు చేయడంలో వైఫల్యం చెందుతున్నారని వారి ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతుబంధు నిధులను ధాన్యం డబ్బులను రైతులకు ఇవ్వకుండా పాత అప్పులు కింద జమ చేసుకుంటున్నారని వారు బ్యాంకర్లను డిమాండ్ చేయడం జరిగింది.  కౌలు రైతులకు రుణమాఫీ వర్తింపుచేయాలి. డిమాండ్,,, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని వెంటనే చెల్లించాలి. కౌలు రైతులకు ప్రభుత్వం గుర్తించి గుర్తింపు కార్డులు రుణమాఫీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. అనేక డిమాండ్లతో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండు సైదులు. T స్వామి.ఎస్ కే దస్తగిరి. ఎస్కే కాసిం సైదా. మైసూర్. ఎం నరసింహారావు. దుర్గయ్య. జి నాగేశ్వరరావు. సిహెచ్ శ్రీనివాసరావు. కోటమ్మ. వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు

Attachments area