రైతు సంఘం సంగారెడ్డి జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయండి.

— పంటలకు గిట్టుబాటు  ధరలు ఇవ్వాలి.                                     — రైతు సంఘం మండల కార్యదర్శి జైపాల్ రెడ్డి.
   సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 11:(జనం సాక్షి):  ఈ నెల 16న సంగారెడ్డిలో జరిగే రైతు సంగం జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి  పి.జైపాల్ రెడ్డి మండల రైతులకు  విజ్ఞప్తి చేశారు .నేడు శివంపేట గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహాసభల కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతు సంఘం ఆధ్వర్యంలో  అనేక రకాల పోరాటాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. రైతులు  పండించిన పంటలకు స్వామి నాధం కమీషన్ సిఫార్సుల ప్రకారం రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని  ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నారని  విమర్శించారు. రైతుల ఆదాయము రెట్టింపు  చేస్తామని పెట్రోలు, డీజిల్ ,ఎరువుల ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని అన్నారు.  రైతుల రుణమాఫీ ని వెంటనే  అమలు  చేయాలన్నారు. పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని మరియు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలని, అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు పండించిన పత్తి వరి కందులు మిరపకాయలు వీటన్నిటికీ మద్దతు ధర  ఇవ్వాలని కోరారు. వరి ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు . నవంబర్ 16న జరిగే రైతు సంఘం సంగారెడ్డి జిల్లా 2 వ మహాసభలు జయప్రదం చేయాలని ఈ మహాసభల కు ముఖ్యఅతిథిగా ఏఐకేఎస్  జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి,రాష్ట్ర కార్యదర్శి సాగర్ లు హాజరుకానున్నారు.రైతులు అదిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని  కోరారు.    ఈ కార్యక్రమంలో  రైతు సంఘం అధ్యక్షులు బి.విఠల్. నాయకులు  మల్లారెడ్డి, నాగభూషణం,సత్యనారాయణ   తదితరులు పాల్గొన్నారు.