రైతు సమగ్రాభివృద్దికి ప్రభుత్వం కృషి

-రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌

పెద్దపల్లి, సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):రైతు సమగ్రాబివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. శుక్రవారం సుల్తానాబాద్‌ మండలం ఐతరాజ్‌ పల్లిలోని రామాలయం దగ్గర రైతు సమన్వయ కమిటీ ఏర్పాటుని పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విదాల రైతులను అభివృద్ది చేయడానికి కృషి చేస్తుందని రైతుల సమగ్రాభివృద్దికి కరెంట్‌ సాగునీరు ఎరువులు పంటకు మంచి దర అత్యంత అవసరమని దీని గురించిన తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన ఆరు మాసాలలోనే కరెంట్‌ కష్టాలు దూరం చేశామని ప్రస్తుతం రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తున్నామన్నారు., తెలంగాణాను కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు రైతులకు రెండు పంటలకు నీరు ఇవ్వడానికి ప్రాజెక్టులు కడుతున్నామని మిషన్‌ కాకతీయ ద్వారా చెరవులకు పూర్వ వైభవం కల్పించామని దీని ద్వారా భూగర్బ జలాలు పెరిగాయని జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు 550 టీఎంసీల గోదావరి జాలాలు సముద్రంలో కలిశాయని ఈనీటిని సద్వినియోగం చేసేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. ఇటీవలే ప్రభుత్వ ఎస్సారెస్పీ పునరుజ్జీవం ప్రాజెక్టును ప్రారంభించిందని దీనిని వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేసి 18 లక్షల ఆయకట్టును స్థిరీకరిస్తామని వచ్చే జూన్‌ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి సాగునీరు అందిస్తామని రైతులకు నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. రైతు సమన్వయ కమిటీలు ఈనెల 9 వతేదీలోగా పూర్తి చేయాల్సిఉందని ప్రతి గ్రామ కమిటీలో 15 మంది ఉంటారని అన్ని కులాలకు ప్రాధాన్యతిస్తామన్నారు. కనీసం ఐదుకుగుమహిళా రైతులుండాలన్నారు. గ్రామంలో ఉండి ఆగ్రామంలో వ్యవసాయం చేసే రైతులను మాత్రమే గ్రామ స్థాయి కమిటీలో చేర్చుకోవాలని గ్రామ అభివృద్దిని కాంక్షించే వారిని సమన్వయ కమిటీలో సభ్యులుగా చేర్చుకవాలన్నారు. జిల్లాఆలో 215 రెవెన్యూ గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేఆలయని మండల రైతు కమిటీని 24 మందితో ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో కనీసం 8 మంది మహిళా రైతులుండాలన్నారు. ప్రతి గ్రామ మండల సమన్వయ సమితిలలో ఒక కోఆర్డినేటర్‌ను ప్రభుత్వం నామినేషన్‌ పద్దతిలో నియమిస్తుందన్నారు. మండల స్థాయి కమిటీలతో జిల్లా స్థాయి కమిటీ ఉంటుందని దీనికి జిల్లా కలెక్టర్‌ నోడల్‌ అధికారిగా ఉంటారన్నారు.రాష్ట్ర ఖజానానుంచి ఈ సమన్వయ సమితిలకోసం 500 కోట్లను కేటాయిస్తున్నామన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డితోపాటు గ్రంధాల సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌ జడ్పీటీసీ భూమేశ్‌ వ్యవసాయాదికారి తిరుమల్‌ ప్రసాద్‌ సర్పంచ్‌ లావణ్య ఇతరులు పాల్గొన్నారు.