రైతు సమస్యలపై అఖిలపక్షం భేటీ

అదిలాబాద్‌: రైతుల పత్తికోనుగోలు విషయంలో తేమతో సంబంధం లేకుండా కోనుగోలు చేయాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.జిల్లా కలెక్టరు అశోక్‌ వ్యవహరతీరుపై ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో తెదేపా, సీపీఐ,సీపీఎం, వైఎన్‌అర్‌సీపీ నాయకులతోపాటు రైతులు పాల్గోన్నారు.