రైనా కోసం అత్తారింట్లో బంద్‌

లక్నో,మార్చి 25 : గురువారం జరిగే ఆస్టేల్రియా,భారత్‌ వన్డే ప్రపంచ కప్‌ మ్యాచ్‌ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడు యూపిలోని ఓ గ్రామం అయితే ఏకంగా ఈ మ్యా/- ఓసం ప్రత్యేకంగా సిద్దం అవుతోంది. తమ వూరికి కాబోయే అల్లుడే స్వయంగా ఆడుతుంటే తామంతా పనులకు ఎలా వెళ్లగలమని వారు తీర్మినించుకున్నారు. అందుకే ఊరికి సెలవు ప్రకటించారు. అంటే బంద్‌ ప్రకటించుకున్నారు. వివరాల్లోకి వెలితే…. ఆ ఊరికి కాబోయే అల్లుడు సురేశ్‌ రైనా…. ఆపై ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా సాగుతున్న భారత క్రికెట్‌ జట్టు సభ్యుడు. ఇంకేముంది.. ఆ గ్రామస్థులంతా సురేశ్‌ రైనాపై పిచ్చి అభిమానం చూపించేస్తున్నారు.. పనిలో పనిగా గురువారం సెమిఫైనల్‌ మ్యాచ్‌ని చూడటానికి వారికి వారే స్వచ్ఛందంగా సెలవు ప్రకటించేసుకున్నారు.. భారత బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా కాబోయే అత్తగారి వూరు.. ఉత్తర ప్రదేశ్‌లోని బమ్నులి గ్రామం.  భారత్‌-ఆసీస్‌ల మధ్య ప్రపంచకప్‌ సెవిూ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో గ్రామస్థులంతా అది చూడడానికి వీలుగా దుకాణాలకు, కార్యాలయాలకు… అన్నిటికీ సెలవిచ్చేశారు. ఈ విధంగా ఊరికి కాబోయే అల్లుడిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రైనా బాల్య స్నేహితురాలు, ఆ గ్రామానికి చెందిన ప్రియాంక చౌధురితో రైనాకు వివాహం నిశ్చయమైంది. దీంతో ఆ గ్రామస్థులంతా  ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. భారత జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకురావాలని గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు సైతం చేసేస్తున్నారు. అంతేకాదు నేటి మ్యాచ్‌ చూడటానికి గ్రామం అంతటా భారీ తెరలు సైతం ఏర్పాటు చేయించారు.