రైనా పెళ్లి సందడి మొదలు
ముంబై: టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. రైనా వివాహం తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరీతో శుక్రవారం జరగనుంది. ఇక్కడి ఒక పేరొందిన హోటల్‌లో రైనా వివాహ వేడుక జరుగుతుందని అతని సన్నిహితులు తెలిపారు. అయితే, పూర్తి వివరాలు వెల్లడించలేదు. రైనా, ప్రియాంక బాల్య స్నేహితులు. ప్రస్తుతం ప్రియాంక నెదర్లాండ్స్‌లో ఉద్యోగం చేస్తోంది. కాగా, బుధవారం ఇక్కడ అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఇరు కుటుంబాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సురేష్ రైనా ఇంట్లో మొదలైన సందడి: రేపే పెళ్లి శుక్రవారం జరగనున్న వివాహానికి పలువురు క్రికెటర్లు, ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నటులు హాజరవుతారు. బుధవారం నాటి కార్యక్రమం కేవలం కుటుంబానికి పరిమితమైందని రైనా సన్నిహితులు తెలిపారు. కాగా, భారత జాతీయ జట్టుకు సేవలు అందిస్తున్న రైనా మార్చి 8 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాల్సి ఉంది.