రైల్వేగేటు వద్ద ఆటోను ఢీకొన్న రైలు
అమరావతి,సెప్టెంబర్24(జనంసాక్షి): నడికుడి రైల్వేస్టేషన్ వద్ద నడికుడి పొందుగుల మధ్యలో సోమవారం లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైల్‌గేట్‌పై ఉన్న ఆటోను ఢీకొంది. బియ్యం లోడుతో వెళుతున్న ఆటో నడికుడి పొందుగుల రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఇంతలో లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రావడాన్ని గమనించిన ఆటో డ్రైవర్ ఆటోను వదిలి పారిపోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. దీంతో ఎక్స్‌ప్రెస్, ఆటోను ఢీకొంది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, విచారణ చేపడుతున్నారు.