రైల్వేస్టేషన్‌లో లభ్యమైన రూ. కోటి విలువైన బ్యాగ్‌

ఖమ్మం, జనంసాక్షి:  రైల్వేస్టేషన్‌లో  రూ. కోటి విలువైన ఓ బ్యాగ్‌ లభ్యమైంది. ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థికి ఈ బ్యాగ్‌ దొరకటంలో, అతడు రైల్వే పోలీసులకు అప్పగించాడు. అందులో నగదుతో పాటు, విలువైన పత్రాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఈ బ్యాగ్‌ గుంటూరుకు చెందిన వ్యాపారిదిగా గుర్తుంచారు. ఆ బ్యాగ్‌ను ఈరోజు కోర్టుకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.