రైల్వే జోన్‌ వస్తుందని సురేష్‌ ప్రభు  హావిూ ఇచ్చారు

– ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు
న్యూఢిల్లీ,ఆగస్టు7(జ‌నంసాక్షి): విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు జరుగుతుందని కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభ హావిూ ఇచ్చారని రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా రాష్ట్ర మంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే జోన్‌ కోసం ఎంపీలతోపాటుగా ఢిల్లీలో పోరాటం చేసేందుకు మంగళవారం ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్లారు. అదేవిధంగా రైల్వే మంత్రి సురేష్‌ ప్రభును కలిశారు. అనంతరం జోన్‌ విషయం గూర్చి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇచ్చిన హావిూలను వెంటనే అమలు చేయాలని, వెంటనే విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. రైల్వే జోన్‌ ద్వారా ఏడాదికి 7 వేల కోట్లు ఆదాయం వస్తుందని, ఇందుకోసం ఎంతోమంది పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు. స్పందించిన సురేష్‌ ప్రభు రైల్వే జోన్‌ వస్తుందని చెప్పారని మంత్రి తెలిపారు. అనంతరం సుజయ్‌ కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. రైల్వే జోన్‌ విషయంలో కేంద్రంపై టీడీపీ పోరాటం చేస్తుంది కానీ కేంద్రం స్పందించకపోవడంతో మేమందరం ఢిల్లీ వచ్చామన్నారు. పార్లమెంటు సభ్యులతో పాటు పోరాటం చేసేందుకే ఢిల్లీ వచ్చామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం మాట ఇచ్చి మరిచిపోయింది కానీ, ప్రజలందరూ పోరాటానికి సిద్దమయ్యారని రైల్వేమంత్రికి చెప్పేందుకు ఢిల్లీ వచ్చామని ఆయన అన్నారు. ఎంపీ తోట నర్సింహం మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన హావిూలను విస్మరించిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యసభలో కేంద్రమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఏపీకి రైల్వేజోన్‌ ఇస్తామని చెప్పారు కానీ కేంద్రంలో ఉన్న అధికారులకు, మంత్రుల మాటలకు పొంతనలేదన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగే పరిస్థితి కనబడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్‌ సాధించే వరకూ పోరాటం కొనసాగుతుందని ఎంపీ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణెళిష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రైల్వే జోన్‌ పోరాటం ఇప్పటిది కాదని, ఇది 30 ఏళ్లదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్టాల్రు ఏర్పడినప్పుడు రైల్వేజోన్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏపీకి ఎందుకు ఇవ్వరు అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతుకు ముందు తెదేపా ఎంపీలు పార్లమెంట్‌ భవనం వద్ద నిరసనను వ్యక్తం చేశారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక ¬దా కల్పించాలని, విభజన చట్టంలోని హావిూలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళనను ఉదృతం చేస్తామని, కేంద్రానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అదేవిధంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అంధుడి వేషధారణలో కేంద్రం తీరును ఎండగట్టారు. పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద అంధుని వేషదారణలో కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండించారు.

తాజావార్తలు