రైల్వే బోర్డు పరీక్షలు వాయిదా

న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి కన్నుమూయడంతో శుక్రవారం నాడు నిర్వహించాల్సిన అసిస్టెంట్‌ లోకోపైలెట్‌, సాంకేతిక నిపుణుల పరీక్షలను రైల్వే రిక్యూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బి) వాయిదా వేసింది. అంతక ముందు వరదలకు గురైన కేరళ మినహాయింపునిస్తూ, భారత్‌ మొత్తం షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వాజ్‌పేయి మరణించిన నేపథ్యంలోశుక్రవారం కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీంటికీ అర్థ సెలవు దినం ప్రకటించారు. ‘ఆర్‌ఆర్‌బి పరీక్షలను శుక్రవారం మూడు దశల్లో ఆ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా నిర్వహిస్తామని ప్రకటించారు. మొత్తం 4.36 లక్షల అభ్యర్థులకు సందేశాలు పంపామని’ ఇన్ఫర్మేషన్‌, పబ్లిసిటి ఆఫ్‌ ఇండియన్‌ రైల్వే డైరెక్టర్‌ పేర్కొన్నారు. కానీ గురువారం సాయంత్రం వాజ్‌పేయి మరణించిన కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

——————