రొల్ల వాగు పాత కట్టను పరిశీలించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
రోళ్ల వాగు కరకట్ట తాత్కాలిక మరమ్మతు పనులు వెంటనే చేపడతాం:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
శాశ్వత పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ కు నివేదిక అందిస్తాం
రొల్ల వాగు పాత కట్టను పరిశీలించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
జగిత్యాల జులై 19:- రోళ్ళ వాగు పాత కట్టకు తాత్కాలిక మరమ్మత్తులు చేసి పంటలు కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేపడతామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంగళవారం బీర్పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్ జగిత్యాల ఎమ్మెల్యే తో కలిసి మంత్రి పరిశీలించారు.
13 వేల ఎకరాల అదనంగా సాగునీరు అందించేందుకు రూ.100 కోట్ల వ్యయంతో రోళ్ళవాగు చెరువు సామర్థ్యాన్ని 0.25 టీఎంసీల నుంచి 1 టీఎంసీ పెంచే పనులు చేపట్టీ 60% పైగా పూర్తి చేశామని మంత్రి అన్నారు. భారీ వర్షాల కారణంగా రోళ్ళ వాగు పాత కట్ట తెగిపోయిందని, పంట పొలాలు పూర్తిగా ఇసుకమెట్టులతో నిండిపోయాయని మంత్రి తెలిపారు.
25 వేల ఎకరాల సాగుభూమి రోళ్ళ వాగు పై ఆధారపడి ఉన్నందున, ప్రస్తుత వర్షాకాల సీజన్ కోసం తాత్కాలిక మరమత్తు పనులు చేపట్టి సాగుకు వినియోగం ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి రోళ్ళ వాగు ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు తయారు చేసి 2,3 రోజుల్లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్తామని మంత్రి పేర్కొన్నారు. రోళ్ళ వాగు ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకోన్ని త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ జి.రవి, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇరిగేషన్ సీఈ సుధాకర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.