రోడ్డు గుంతలు పూడ్చిన టేకులపల్లి పోలీసులు

కొత్తగూడెం, ఇల్లందు ప్రధాన రహదారిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు పొంచి ఉండడంతో టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుకు మరమ్మతులు చేపట్టి గుంతలు పూడ్చివేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు మండల పరిధిలోని తొమ్మిదవ మైలు తండా నుండి టేకులపల్లి వరకు అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండడం, గుంతలలో పడిపోయి ప్రమాదాలు ఏర్పడటంతో చలించిన టేకులపల్లి పోలీసులు గుంతలను పూడ్చివేశారు. వాహనదారులు, ప్రయాణికులు టేకులపల్లి పోలీసులు చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమానికి ఆనందం వ్యక్తపరుస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

తాజావార్తలు