రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కరీంనగర్: కోహెడ మండలం శనిగారం వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ – సమో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.