రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం…

పుల్కాల్ జనం సాక్షి న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.161వ నాందేడ్-అఖోలా జాతీయ రహదారిపై జోగిపేటకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదంలో మృతి చెందారు. చౌటకూర్ మండలం తాడ్ దాన్ పల్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బులేరో వాహనం ఆటో ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులు జోగిపేటకు చెందిన ఫరిద్ ఇర్ఫాన్ ఇద్దరు అన్నదమ్ములుగా స్థానికులు గుర్తించారు. వీరు జోగిపేట మార్కెట్ లో పూల విక్రయాలు చేస్తూ జీవనం కొనసాగిస్తారు. రోజు లాగే హైదరాబాద్ మొంజా మార్కెట్ నుండి బుధవారం తెల్లవారు జామున ఆటోలో ఇద్దరు అన్నదమ్ములు పూలు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన బులేరో వాహనం ఆటోను తాడ్ దాన్ పల్లి చౌరస్తా వద్ద డికొట్టింది. దింతో అన్నదమ్ములు ఇర్ఫాన్ మరియు ఫరీడ్ లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం చేసిన బులేరో వాహన డ్రైవర్ ను స్థానికులు పట్టుకొని తాళ్లతో బంధించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను స్థానికుల సహాయంతో ఆటోలో నుండి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు….