రోడ్డు మీదికి చేరిన వర్షపు నీరు,పట్టించుకోని అధికారులు, అవస్థలు పడుతున్న విద్యార్థులు, అధికారులపై మండిపడుతున్న విద్యార్థి తల్లిదండ్రులు

రోడ్డు మీదికి చేరిన వర్షపు నీరు,పట్టించుకోని అధికారులు, అవస్థలు పడుతున్న విద్యార్థులు, అధికారులపై మండిపడుతున్న విద్యార్థి తల్లిదండ్రులు

కోటపల్లి సెప్టెంబర్ 23,(జనం సాక్షి) కోటపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ పక్కన ఇటీవల కురిసిన వర్షానికి కోటర్స్ రోడ్డు ని టిలో మునిగిపోయింది రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైనేజీ లేకపోవడం నీరు నిల్వ ఉండటంవల్ల దోమలు మురుగు వాసనతో కంపు కొడుతుందని కోటర్స్ కాలనీ ప్రజలు అంటున్నారు.పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థిలకు ఇబ్బంది కలుగుతుందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.మండల కేంద్రంలో బాధాకరమని విద్యార్థి తల్లిదండ్రులు చింతిస్తున్నారు.ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ సమస్య ను పరిష్కరించాలని విద్యార్థి తల్లిదండ్రులు ప్రజా ప్రతినిధులను అధికారులను కోరారు.