రోడ్డు రీబిటింగ్ పనులను ప్రారంభించిన..!!
సర్పంచ్ ఉమారాణి రాజ గౌడ్
జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో బీటీ రోడ్ నిర్మాణానికి సర్పంచ్ ఉమాదేవి రాజ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరు కాగా కొల్చారం బస్టాండ్ నుండి అంసాన్ పల్లి తండా ప్రభుత్వ పాఠశాల వరకు బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంతోకాలంగా రోడ్డు చెడిపోయి ఇబ్బంది పడుతున్న వాహనదారుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా నాలుగున్నర కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి కోటిన్నర రూపాయలు మంజూరైనట్టు వారు తెలిపారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరెంట్ రాజా గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాండ్ర వెంకటేశం, పట్లూరి నర్సింలు, ఆశన్న గారి అంజయ్య, సాతెల్లి షేకులు, వడ్ల ప్రభాకర్, ఆర్కెల నాగయ్య, గంధం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.