రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు..

టేక్మాల్ జనం సాక్షి జూన్ 25 టేక్మాల్ మండలం లోని 13 గ్రామాల రోడ్ల మరమ్మతులకు 8 కోట్ల 79 లక్షల రూపాయలు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రత్యేక చొరవతో మంజూరు చేయించారని టేక్మాల్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప ప్రధాన కార్యదర్శి అవినాష్  తెలియ జేశారు.
శనివారం టేక్మాల్ ప్రెస్ క్లబ్ లో  ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ
పిడబ్ల్యుడి రోడ్డు నుంచి అసద్మమ్మద్ పల్లి వయా తాండ వరకు 90 లక్షల రూపాయలు, టేక్మాల్ టు ఎలకుర్తి పిడబ్ల్యుడి రోడ్డు 97 లక్షలు, అచ్చన్నపల్లి టూ టేక్మాల్ వయా అసద్మమ్మద్ పల్లి కోటి 83 లక్షలు, బురుగుపల్లి వయా తంప్లురు  కోటి 8 లక్షలు, బర్దిపూర్ రోడ్డు 75 లక్షలు షాబాద్ తాండ రోడ్డు 45 లక్షలు, వేల్పుగొండ రోడ్డు 36 లక్షలు, బొదగట్టు 27 లక్షలు వెంకటాపూర్ 57 లక్షలు, కాదులూరు 18 లక్షలు, దాదాయిపల్లి 66 లక్షలు మల్కాపూర్ 54 లక్షలు, ఆర్ అండ్ బి రోడ్డు టు ఎల్లంపల్లి తండ 23 లక్షలు, అన్ని కలిపి ఎనిమిది కోట్ల 79 లక్షలు మంజూరు అయ్యాయని రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు  స్థానిక శాసనసభ్యులు క్రాంతి కిరణ్ కు టేక్మాల్ మండల టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు మరియు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు నారాయణ, సంగయ్య, నాయకులు చింత రవి, సిద్దయ్య భాస్కర్, మహేందర్, శ్రీశైలం, చందర్ తదితరులు పాల్గొన్నారు.