రోహిత్ శేకర్ తండ్రి తివారీయే
న్యూఢిల్లీ, జూలై 27 : ఉజ్వల శర్మతో రాష్ట్రగవర్నర్ ఎన్డీ తివారీ నడిపిన వ్యవహారం వలనే రోహిత్ శేఖర్ జన్మించినట్లు డిఎస్‌ఎ నివేదిక బయటపెట్టింది. డిఎస్‌ఎ పరీక్షల నివేదికను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం బయటపెట్టింది. నివేదికను హైకోర్టు రోహిత్ శేఖర్‌కు, తివారీ న్యాయవాదులకు అందించింది. ఈ నివేదిక బయటపడకుండా తివారీ తీవ్ర ప్రయత్నాలు చేశారు. సుదీర్ఘ న్యాయపోరాటం ద్వారా రోహిత్ తల్లి ఉజ్వలశర్మ విజయం సాధించారు. పితృత్వం కేసులో తనపై జరిపిన డిఎస్‌ఎ పరీక్షల నివేదికను గోప్యంగా ఉంచాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసివచ్చింది. ఎన్టీ తివారీని తన తండిగా ప్రకటించాలని కోరుతూ
రోహిత్ 32ఏళ్ల యువకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 97 ఏళ్ల తివారీ కష్టాల్లో పడ్డారు.