ర్యాగటమ్మ జాతర లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్సీ లు. దౌల్తాబాద్ జూన్ 13, జనం సాక్షి.

 దౌల్తాబాద్ మండల పరిధిలో శెరి పల్లి బందారం గ్రామంలో గ్రామ దేవత ర్యాగాటమ్మ జాతర లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవ రెడ్డి, బండ ప్రకాష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయ బద్ధంగా ప్రతి సంవత్సరం గ్రామదేవతను పూజించుకోవటం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు.ఈ గ్రామాన్ని దౌల్తాబాద్ మండలాన్ని పాడి పంటలతో చల్లగా చూడాలని ఆ దేవతను మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,జిల్లా కోఆప్షన్ రహిమోద్దిన్,పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి,వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్,మండల యువత అధ్యక్షులు నర్ర రాజేందర్,గ్రామ సర్పంచ్ స్వప్న జనార్దన్ రెడ్డి ఎంపీటీసీ నవీన్ కుమార్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీ లు తెరాస కార్యకర్తలు ,గ్రామస్సులు తదితరులు పాల్గొన్నారు