రవిదాస్ 645వ జయంతి
న్యూఢిల్లీ: ఇవాళ రవిదాస్ 645వ జయంతి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో ఉన్న రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరానికి వెళ్లారు. అక్కడ ఆయన షాదాబ్ కీర్తన్‌లో పాల్గొన్నారు. ఆలయంలో ఉన్న భక్తులతో కలిసి మోదీ కచేరి చేశారు. కీర్తనలను ఆలపించారు. కులం, అస్పృశ్యత నిర్మూలనకు రవిదాస్ కీలకపాత్ర పోషించారు. ఎందరికో ఆయన ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తారని ప్రధాని మోదీ అన్నారు. గురు రవిదాస్ మాఘ పూర్ణిమా రోజున పుట్టారు. 1377వ సంవత్సరంలో వారణాసిలోని మందౌధి వద్ద ఆయన జన్మించారు. రవిదాస్ ఓ కవి, సామాజిక సంస్కర్త, ఆధ్మాత్మిక గురువు. భక్తి గీతాలు, కీర్తనలు, ఆధ్యాత్మిక బోధనలతో ఆయన భక్తి ఉద్యమాన్ని నడిపారు. సిక్కు మతస్థుల పవిత్ర గ్రంధం ఆది గ్రంథ్‌లో 40 పద్యాలు రాశారు.