రష్యా యుద్ధ విమానాలు బాంబుల వర్షం
కీవ్: ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. సోమవారం రాత్రివేళ ఆ దాడులు జరిగాయి. ఆ అటాక్‌లో చిన్నారులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. రాత్రి 11 తర్వాత సుమీ నగరంలోని ఈశాన్య ప్రాంతంలో రష్యా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించినట్లు ఆ ప్రాంత మిలిటరీ ఆఫీసర్ డిమిట్రో జివిట్‌స్కీ తెలిపారు. దురదృష్టవశాత్తు చిన్నారులు మృతిచెందినట్లు ఆయన చెప్పారు. దాదాపు పది మంది కన్నా ఎక్కువ సంఖ్యలో మృతిచెంది ఉంటారని ఆయన అన్నారు. చిన్నారుల్ని చంపేసినట్లు డిమిట్రో తన ఫేస్‌బుక్ వీడియోలో తెలిపారు. దీన్ని ఎప్పటికీ క్షమించబోమన్నారు. దాడుల్లో ఇండ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు చెప్పారు. రష్యా జరిపిన కాల్పుల్లో నలుగురు సైనికులు మృతిచెందినట్లు ప్రకటించారు.