లంచం తీసుకుంటు ఎసీబీకి చిక్కిన వీఆర్‌వో
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా మామిడ మండలానికి చెందిన వీఆర్‌వో కోశెట్టి లంచం తీసుకుంటుండగా ఎసీబీకి చిక్కాడు. మండలంలోని న్యూ టెంపూర్ణి గ్రామానికి చెందిన గంగరాం అనే రైతు పట్టాదారు పాస్తకాలం కోసం వీఆర్‌వోను ఆశ్రయించగా రూ.5వేల లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధిత రైతు ఎసీబీని ఆశ్రయించాడు. శనివారం బాధిత రైతు నుంచి వీఆర్‌వో లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు పట్టుకున్నారు.