లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని ప్రజాసేవ చేయడానికి వచ్చిన సునీల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలి

జనంసాక్షి, మంథని : ప్రవాసి ఎమ్మెల్యే సంపర్క్ అభియాన్ కార్యక్రమం మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి ఆధ్వర్యంలో మంథని పట్టణలో
అస్సాం ఎమ్మెల్యే సుశాంత్, మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాం రెడ్డి, మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మంథని పట్టణ,మండలల కు సంబందించిన మండల కమిటీ,పట్టణ కమిటీ శక్తి కేంద్ర ఇంచార్జ్ లు, సీనియర్ నాయకులతో పాటు బూత్ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం సుశాంత్ మాట్లాడుతూ.. మన దేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు.పసల్ భీమా, ఆయుష్ మాన్ భరత్, అవాస్ యోజన వంటి పథకాలు తెలంగాణ లో వస్తే ప్రజలు అందరూ మోదీ కి ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల, భూమి ఇస్తానని, దళిత ముఖ్య మంత్రి అని చేపి మోసం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కొరకు జీవితాలు త్యాగం చేసి కొట్లాడిన సునీల్ రెడ్డి కి 2014 లో టికెట్ ఇవ్వకుండా డబ్బులకు టికెట్ అమ్ముకున్నారు కెసిఆర్ అని ఆరోపించారు. నిజమైన ఉద్యమ కారుడు సునీల్ రెడ్డి ని గెలిపించండి.. తెలంగాణ కోసం ఎలాంటి పోరాటం చేయని వాళ్లు ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ఈ మంథని నియోజకవర్గం రైతాంగం తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పి లక్షలాది రూపాయల జీతాన్ని వదులుకొని ప్రజాసేవయే లక్ష్యంగా పనిచేస్తున్న వివాద రహితుడు బిజెపి రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి ని రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మంథని పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బైక్ ర్యాలీ పాత పెట్రోల్ బంక్ నుండి అంబేద్కర్ చౌరస్తా గుండా మంథని పట్టణ పురవీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్క మోహన్ రావు, కో కన్వీనర్ నాంపల్లి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి పోతరవేని క్రాంతికుమార్, పోగ్రామ్ కన్వినర్ ఎడ్ల సదశివ్, బి ఎస్ ఏ నియోజకవర్గ ఇంచార్జ్ చిలువేరి సతీష్, మండల ఇంచార్జ్ తోట మధుకర్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు.