లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలి
సంగారెడ్డి, నవంబర్ 29 : డ్వామా శాఖ ద్వారా చేపట్టడుతున్న పనులను నిర్ణయించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఎ.దినకర్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డ్వామా శాఖకు సంబంధించి డ్వామా పిడి, పిడి ఎపిఎంఐసి, విద్యుత్ శాఖాధికారులు, డ్వామా ఎపిడిలు, మెగావాటర్ షెడ్ ప్రాజెక్టు ఆఫీసర్లు, క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్‌లతో డ్వామా పనుల పురోగతిపై సమీక్షించారు.