లగడాపాటి ఓ రాజకీయ బపూన్ : కేటీఆర్
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్టుపడుతున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లగడపాటి ఓ రాజకీయ బపూన్ అని విమర్శించారు. లగడపాటి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణపై కేంద్రం స్పందించకుంటే మాత్రం యాచించి కాదు, శాసించి తెలంగాణ తెచుకుందామని ఆయన పిలుపునిచ్చారు. 2009లో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి నోటికాడి బుక్క లాక్కున్న పరిస్థితిని మనం చూశామన్నారు. కనుక ఇప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.