లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు.
మండల కేంద్రంలో మల్లాపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కనుక సంజీవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భాష దినోత్సవన్ని పురస్కరించుకొని ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాళోజి రచనలు, కవితలతో ప్రజలను చైతన్య పరిచిన వ్యక్తిని అన్నారు. గొప్ప వ్యక్తుల అడుగుజాడల్లో నడుస్తూ, స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ సెక్రెటరీ రుద్ర రాంప్రసాద్, హెచ్ 143 ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు ముత్యాల రమేష్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు అయ్యోరి దశరథం, సంఘం భక్త మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సిరిపురం రవీందర్, పద్మశాలి సంఘం సభ్యులు పేంబీ మహేందర్, లయన్స్ క్లబ్ సభ్యులు మహేష్, గ్రామస్తులు జక్కుల రాజేంద్రప్రసాద్, బెజ్జరాపు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.