లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: మహిళ మృతి
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ వద్ద రహదారిపై ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, 12మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.