లారీ ఢీకొని మహిళ మృతి
ఖమ్మం, జనంసాక్షి: చింతకాని మండలంలోని నాగులపంచ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దంపతులు ద్విచక్రవాహనంపై వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన మృతురాలి భర్తను స్థానిక ఆసుపత్రికి తరలించారు.