లింగా నాయక్ కుటుంబానికి అండగా ఉంటాం
* వైరా ఎమ్మెల్యే రాములు నాయక్
జూలూరుపాడు, ఆగష్టు 7, జనంసాక్షి: మండల పరిధిలోని బేతాళపాడు గ్రామ పంచాయతీ పీక్లా తండాకు చెందిన గుగులోతు లింగా నాయక్ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను అందించటంతో పాటు, కుటుంబానికి అండగా ఉంటామని. ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, ఎంపీపీ లావుడియా సోనీ, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ రాందాస్, యల్లంకి పుల్లయ్య, మాచినేని సత్యనారాయణ, మోదుగు రామకృష్ణ, పణితి వెంకటేశ్వర్లు, ఎస్కే మైబు, మద్దిశెట్టి ప్రకాష్, మిరియాల కిరణ్, మాడుగుల నాగరాజు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు