లిబియాలో 200 మంది జలసమాధి
కల్లోల ప్రాంతం నుంచి బతుకును వెతుక్కుంటూ బయలుదేరిన వారిలో సుమారు 200 మంది జలసమాధి అయ్యారు. ఈ విషాద ఘటన లిబియాలో జరిగింది. లిబియాలోని జువారా పట్టణం నుండి 400 మందితో కిక్కిరిసిన ఓ నౌక ఇటలీ వైపు బయలుదేరింది. ఐతే, అది మధ్యదరా సముద్రంలోని లిబియా తీర ప్రాంతంలో మునిగిపోయింది. తీర గస్తీ దళాలు 201 మందిని కాపాడాయి. అందులో 147 మంది అక్రమంగా వలస వెళ్తున్నట్లు తెలిసింది. వారందరిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు సమాచారం. నౌకతో పాటు జల సమాధి అయిన వారిలో ఆఫ్రికా, పాకిస్తాన్, సిరియా, మొరాకో, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందినవాళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గురువారం వేర్వేరు సంఘటనల్లో 1,430 మందిని లిబియా సముద్ర జలాల్లో కాపాడినట్లు ఇటలీ సంస్థ ఒకటి వెల్లడించింది