లెఫ్ట్‌ బస్సు యాత్రను అడ్డుకున్న పోలీసులు

తిరుపతి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): 15 న నిర్వహించనున్న మహాగర్జన సంసిద్ధతకు సిపిఎం-సిపిఐ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం తిరుపతిలో కొనసాగింది. ముందుగా బహిరంగ సభ నిర్వహించి అనంతరం బస్సు యాత్ర బయలుదేరింది. సిపిఎం, సిపిఐ బస్సు యాత్రలో భాగంగా.. చంద్రగిరి మండలం నారావారిపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను పరిశీలించేందుకు బస్సు యాత్ర బృందం బయలుదేరింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ మహంతి ముందుగానే బస్సు యాత్రను నారావారిపల్లిలోకి పోనీయకుండా అడ్డగించేందుకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. తిరుపతి నుండి పీలేరు వెళుతూ నారావారిపల్లిలోని ఆస్పత్రిని సందర్శించాలనుకున్న వామపక్ష నేతలను పోలీసులు రంగంపేటలోనే బారీకేడ్లు పెట్టి అడ్డగించారు. బస్సు యాత్రలో సిపిఐ రామకృష్ణ, సిపిఎం నేతలు వి.శ్రీనివాసరావు, రమాదేవి, తదితరులు ఉన్నారు.

 

తాజావార్తలు