లోక్సత్తా సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన జేపీ
కర్నూలు : లోక్సత్తా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కర్నూలు నగరంలో బుధవారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నెల మొత్తం సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి నెలలో రహస్య ఓటింగ్ ద్వారా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీపరంగా ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వారసత్వ రాజకీయాలకు లోక్సత్తా దూరంగా ఉంటుందని, అందుకే ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.