లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రావు: ఏచూరి జోష్యం
హైదరాబాద్, జనంసాక్షి: లోక్‌సభకు ముందస్తు ఎన్నిలు రావని సీపీఎం జాతీయ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సీతారాం ఏచూరి జోష్యం చెప్పారు. ఇవాళ ఆయన నగరంలో పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెమినార్‌లో పాల్గొని మాట్లాడారు. దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనుకోవడంలేదని తెలిపారు. ప్రజా ఉద్యమాల మీదే సీపీఎం దృష్టి పెట్టిందని, అదే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పొత్తులు , ఇతర సర్దుబాట్లు నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఇంకో కూటమీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.