లోక్ అదాలత్ లో 23 బ్యాంక్ కేసుల పరిష్కారం

జూనియర్ సివిల్ జర్జ్ ఆర్. అజయ్

ఖానాపూర్ రూరల్ 17 సెప్టెంబర్ (జనం సాక్షి): లోక్ అదాలత్ ఆధ్వర్యంలో శనివారం బ్యాంక్ రుణాల రికవరీ కి సంబంధించిన 23 కేసులు జూనియర్ సివిల్ జర్జ్ ఆర్.అజయ్ ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జర్జ్ కోర్ట్ ఖానాపూర్ లో నిర్వహించిన లోక్ అదాలత్ లో పరిష్కారం అయ్యాయని కోర్ట్ సుపరిండెంట్ అదిల్ తెలిపారు.ఈ లోక్ అదాలత్ బెంచ్ సభ్యులు మట్టేరి రాజశేఖర్,ఎండి అసిఫ్ అలీ,తో పాటు అడ్వకేట్ల సంఘము అధ్యక్షులు మంత్ర రాజం సురేష్,న్యాయ వాదులు నెరేళ్ల సత్యనారాయణ,కిషోర్ నాయక్,కోర్ట్ సిబ్బంది, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.