లోక్ సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ ఆరోగ్య పరిస్థితి విషమం

కోల్‌కత్తా(జ‌నం సాక్షి ) :లోక్ సభ మాజీ స్పీకర్, CPM వెటర్న్ లీడర్ సోమ్ నాథ్ చటర్జీ(89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను శుక్రవారం(ఆగస్టు-10) కోల్ కతాలోని ఓ హాస్పిటల్ లో చేరారు. ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.  జూన్ నెలలో రక్తనాళాల్లో స్ట్రోక్ వచ్చినప్పటినుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారుతోంది.ఇటీవల శ్వాస సంబంధిత సమస్యతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సోమ్ నాథ్.. కొద్దిరోజుల్లోనే రికవరీ కావడంతో ఇంటికి వెళ్లిపోయారు. మన దేశంలో సుదీర్ఘ కాలం పనిచేసిన పార్లమెంట్ సభ్యుల్లో ఆయన ఒకరు. 1971 నుంచి 2004 మధ్యలో.. ఆయన ఏకంగా పదిసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1984లో మమతా బెనర్జీ చేతిలో ఒకసారి ఓడిపోయారు. 2004 నుంచి 2009 వరకు లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించారు.మొదటి నంచి సీపీఎంలోనే ఉన్న ఆయన.. 2008 వరకు కొనసాగారు. ఇండియా-యూఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ సందర్భంగా యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు వెనక్కి తీసుకున్నప్పుడు.. పార్టీ ఆదేశాల మేరకు ఆయన లోక్ సభ స్పీకర్ పదవి నుంచి తప్పుకోలేదు. ఈ కారణంతో ఆయన్ను పార్టీనుంచి తొలగించారు. ఇండిపెండెంట్ పొలిటీషియన్ గా ఉన్న ఆయనకు రాజకీయవర్గాల్లో అపారమైన గౌరవం ఉంది.