ల్యాండ్‌పూలింగ్ విధివిధానాల రూపకల్పనకు కమిటీ
హైదరాబాద్: పట్టణ, నగర ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టుల విధివిధానాలను రూపొందించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. 15 రోజుల్లో దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్ నగరాభివృద్థి సంస్థ కమిషనర్ అధ్యక్షతన మున్సిపల్ సంచాలకులు, వుడా ఉపాధ్యక్షులు, విజీటీఎం ఉపాధ్యక్షులుమరో నిపుణుడు సభ్యులుగా, పట్టణ ప్రణాళికా విభాగం సంచాలకుడు సభ్య కార్యదర్శిగా ఈ కమిటీలో ఉంటారని ప్రభుత్వం తెలిపింది.