వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యం
టీకా వేస్కో.. బహుమతి తీస్కో నినాదం
అనంతపురం,డిసెంబర్3 (జనంసాక్షి) : జిల్లాలో వ్యాక్సినేషన్ కోసం అధికారులు కసరత్తు చేపట్టారు. వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. టీకా వేస్కో.. బహుమతి తీస్కో.. అనే కార్యక్రమం తీసుకొచ్చారు. జిల్లాలో వందశాతం కరోనా వ్యాక్సినేషన సాధనకు వైద్యశాఖ కుస్తీ పడుతోంది. ఇప్పటి వరకు టీకా వేయించుకోవడానికి ముందుకు రాని వారికి బహుమతుల ఎర వేస్తోంది. జిల్లాలో పెనుకొండ, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలో టీకా శాతం తక్కువగా నమోదైంది. అక్కడున్న 23 పీహెచసీల పరిధిలో ఈ బహుమతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈనెల 30వ తేదీ వరకు పెనుకొండ, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలోని సోమందేపల్లి, గోరంట్ల, పరిగి, చిలమత్తూరు, లేపాక్షి, కేబీహళ్లి, కల్లుమర్రి, నీలకంఠాపురం, అగళి, రొళ్ళ, గుడిబండ, అమరాపురం, గుండుమల, ము ద్దినాయనపల్లి, బెలుగుప్ప, కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట, రాయదుర్గం పీహెచసీల్లో వ్యాక్సిన వేయించుకున్న వారికి కూపన ఇస్తారు. ఆ కూపనలో తమ వివరాలు నమోదు చేసి, అక్కడ ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలి. ఈనెల 31న లక్కీడ్రా తీస్తారు. మొదటి బహుమతి పొందిన ముగ్గురికి మిక్సర్ గైర్రడర్లు, రెండో బహుమతి పొందిన ఐదుగురికి ప్రెజర్ కుక్కర్లు, మూడో బహుమతి కింద 10 మందికి డిజిటల్ బీపీ ఆపరేటర్లు ఇవ్వనున్నట్లు జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్ తెలిపారు.