వంద పడకల ఆసుపత్రిగా చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
-ఫలించిన ఎమ్మెల్యే రవిశంకర్ కృషి
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో చొప్పదండి నియోజకవర్గ కేంద్రానికి 100 పడకల ఆసుపత్రికి కావాలని కోరగా అందుకు సంబంధించిన జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
చొప్పదండి, ఆగస్టు 10 (జనం సాక్షి): చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేట్ చేయాలని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అసెంబ్లీ సమావేశాలలో కోరగా చొప్పదండి ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో మంజూరు చేసింది.అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని ప్రాథమిక ఆస్పత్రి ని 30 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రి గా అప్ గ్రేడ్ గా చేయాలని కోరగా ,గురువారం 100 పడకల ఆసుపత్రి కొరకు 37.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ G.O జారీ చేసింది. 100 ఆస్పత్రి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ,మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్ లకు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ లకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.