వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరగాలి

అంగన్వాడి డే జరపాలి
తల్లి బిడ్డల సురక్షితానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి
ఇమ్యూనైజెషన్ వంద శాతం జరగాలి
 డాక్టర్ల పనితీరుతో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరగాలి
… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

జిల్లాలో వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలని, అందుకు వైద్యారోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పేర్కొన్నారు.మంగళవారం ఆయన  వైద్యారోగ్య శాఖ, ఐసిడిఎస్ అధికారులు, డాక్టర్లు, సిడిపిఓలు, సూపర్వైజర్లతో  వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రధానంగా గర్భిణీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు, సిజీరియన్ ఆపరేషన్లు, ఇమ్యూనైజషన్ తదితరాల అమలును నిశితంగా పరిశీలన
చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో వంద శాతం ప్రసవాలు జరగాలన్నారు. ఐసిడిఎస్, వైద్య ఆరోగ్యశాఖలు సమన్వయ లోపం లేకుండా పనిచేయాలన్నారు.
సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వంద శాతం ఇమ్యునైజేషన్ జరగాలని, ప్రతి పీహెచ్ సి లో కనీసం 75 శాతం ప్రసవాలు జరగాలన్నారు.వంద శాతం సాధారణ ప్రసవాలు జరగాలని స్పష్టం చేశారు. తప్పని సరి అయితే మాత్రమే సి సెక్షన్ చేయాలన్నారు.  గర్భిణులకు  అనుబంధ ఆహారం అవసరమైన వారిపై దృష్టి సారించి అందించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్లకు సూచించారు. అదేవిధంగా అంగన్వాడీ డే ను విధిగా జరపాలని ఆదేశించారు. తల్లి బిడ్డల సురక్షితానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి గర్భిణీకి సంబంధించిన వివరాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే గర్భిణీలు కాన్పు చేయించుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. పి హెచ్ సి వారిగా ఏ ఎం సి రిజిస్టర్ నిర్వహించాలని, అంగన్వాడి సెంటర్ కు విధిగా ఏఎన్ఎం వెళ్లాలని తెలిపారు.  ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత గణనీయంగా పెరగాలని,  ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందిస్తే ప్రజలు తప్పకుండా ప్రుభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకుంటారని అన్నారు. , అంకిత భావంతో విధులు నిర్వర్తించాలన్నారు.పీ హెచ్ సి ల పనితీరును డిప్యూటీ డీ ఎం హెచ్ ఓ లు అనునిత్యం పర్యవేక్షణ చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అన్ని విధాల చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడి సూపర్వైజర్లు గ్రామంలో టీబి వ్యాధిగ్రస్తులను గుర్తించి ఏఎన్ ఎం లకు తెలుపాలన్నారు. వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత చికిత్స, మందులతోపాటు నెలకు 500 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు.ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశాలు నిర్వహించాలని, పీహెచ్సీ వారిగా ప్రసవాల నివేదికను అందించాలనిడి ఎం అండ్ హెచ్ ఓ కు సూచించారు.అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ కింద సర్జరీలు రెగ్యులర్గా చేయాలని ఆదేశించారు.
మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల పురోగతిని ఆర్ అండ్ బి అధికారులతో ఆరా తీశారు. ఈనెల 15లోగా అన్ని హంగులతో సిద్ధమవుతుందని ఆర్ అండ్ బి  ఈ సురేష్ కలెక్టర్కు తెలిపారు. హాస్టల్ బిల్డింగ్ కూడా సిద్ధం చేయాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని మెడికల్ కాలేజ్ సూపరిండెంట్ కు సూచించారు.ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ రాజార్షి షా, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గాయత్రీ దేవి, డి సి హెచ్ ఎస్ డా. సంగారెడ్డి, డాక్టర్లు, ఏరియా ఆసుపత్రుల సూపరిండెంట్లు,
 ఐ సి డి ఎస్అధికారి  పద్మావతి, సిడిపి ఓలు, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు