వక్ప్‌ బోర్డు ఆస్తులు పెంచేందుకే.. 

జామా మసీదు ఆస్తులు లీజుకు
– అధిక కోడ్‌ చేసిన వారికే లీజుకిచ్చాం
– తాను ఎవరిదగ్గరైన డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
– వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జలీల్‌ఖాన్‌
విజయవాడ, జులై31(జ‌నం సాక్షి) : వక్ఫ్‌బోర్డు ఆస్తులు పెంచేందుకే జామా మసీదు ఆస్తులు లీజుకిచ్చామని వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ జలీల్‌ఖాన్‌ వివరణ ఇచ్చారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ రాజకీయ కారణాలతో కొందరు ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. వేలంలో అధికంగా కోడ్‌ చేసినవారికే లీజుకిచ్చామని తెలిపారు. తాను ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని జలీల్‌ఖాన్‌ సవాల్‌ విసిరారు. వక్ఫ్‌ బోర్డుకు ప్రభుత్వం నుంచి నిధులు రావని, తామే సమకూర్చాలని తెలిపారు. వక్ఫ్‌ బోర్డుకు ప్రభుత్వం నుంచి నిధులు రావని, తామే సమకూర్చాలని తెలిపారు. చందనా బ్రదర్స్‌తో ప్రస్తుతం చేసుకున్న ఒప్పందం రద్దు చేస్తున్నామని, మళ్లీ బహిరంగ వేలం నిర్వహిస్తామని జలీల్‌ఖాన్‌ వెల్లడించారు. ఓ సంస్థకు కారు చవకగా జూమ్మా మసీదు ఆస్తులు కట్టబెట్టారని ఆరోపిస్తూ విజయవాడలో సీపీఐ, జనసేన పార్టీ నేతలు వేర్వురుగా ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.  తనపై అసత్యపు ఆరోపణలు చేసి తనను బదనాం చేయాలనే కొందరు పనిగట్టుకొని ఆందోళనలు నిర్వహిస్తున్నారని జలీల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా వాటిని నిరూపించలేరని, తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.

జలీల్‌ఖాన్‌ను పదవి నుంచి తొలగించాలి..
జామా మసీదు ఆస్తులు అన్యాక్రాంతం చేస్తున్నారంటూ సీపీఐ, జనసేన పార్టీ నేతలు విజయవాడలో మంగళవారం వేర్వేరుగా ఆందోళనలు చేపట్టారు. వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ జలీల్‌ఖాన్‌ ఓ సంస్థకు కారు చవకగా జామా మసీదు ఆస్తులు కట్టబెట్టారని వారు ఆరోపించారు. రూ.కోట్ల ఆదాయం వచ్చే ఆస్తులను కేవలం రూ.5లక్షలకే కట్టబెట్టారని మండిపడ్డారు. వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ పదవి నుంచి జలీల్‌ఖాన్‌ను తొలగించాలని ఇరు పార్టీలకు చెందిన నేతలు డిమాండ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు.

తాజావార్తలు