వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: శశిధర్ రెడ్డి
మెదక్,జూన్14(జనం సాక్షి): రాష్ట్రంలో పరిస్తితులు చూస్తుంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని మాజీఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పి.శశిధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో భ్రమలు తొలగి పోతున్నాయని అన్నారు. ఇక ఈ ఏడాది కాలంలో ఇంకా భ్రమలు కల్పించలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను విస్మరించి ప్రజావ్యతిరేక పాలన సాగించడంతో యువతరం కాంగ్రెస్ పార్టీలో రోజుకో గ్రామం నుంచి చేరుతోందని అన్నారు. 2019 ఎన్నికలకు ఇవన్నీ శుభసూచికమన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడకుండా పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.