వచ్చే దసరా నాటికి తెలంగాణ సాకారం కావాలి
టీపీజేఏసి
విజయనగర్‌కాలనీ : వచ్చే సంవత్సరం దసరా నాటికి నాలుగు కోట్ల మంది ప్రజల అకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ కోర్కె సాకారం కావాలని లెతంగాణ పాలిటెక్నిక్ ఐకాస (టీపీజేఏసీ) ప్రతినిధులు బుధవారం మాసాజ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల గుండెచప్పుడైన ప్రత్యేక తెలంగాణను సాధించే వరకూ విశ్రమించేది లేదని కార్యక్రమానికి నేతృత్వం వహించిన తెలంగాణ పాలిటెక్నిక్ ఐకాస (టీపీజేఏసీ) కన్వీనర్ మురళీధర్‌గుప్త స్పష్టం చేశారు. జగన్మాత దయతో త్వరలోనే తెలంగాణను సాధించుకుంటామని తెలిపారు.ఇది తప్ప తమకు మరోక లక్ష్యం లేదని పేర్కోన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు న్యాయం జరగటం లేదని అవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి సహఫంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీపీజేఏసీ ముఖ్య నాయకులు పెర్కోన్నారు.